నకిరేకల్,ఫిబ్రవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్ అనే రైతు మరణానికి బీజేపీ బాధ్యత వహించాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల పై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.రైతుల సమస్యలను పరిష్కరించలేని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దాడి చేసి రైతులను చంపడం దుర్మార్గ చర్య అని అన్నారు.ఫిబ్రవరి 21న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతాంగం పై పంజాబ్,హర్యానా సరిహద్దు ఖీ నౌరి వద్దా రైతాంగం పై పోలీసు యంత్రాంగం జరిపిన పాశావిక దాడులలో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి సంతానం సంతాపాన్ని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతంగంపై కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పోలీస్ కాల్పుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి పోలీసు కాల్పుల్లో క్షేత్రగాత్రులైన రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి వారిని ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందని అన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



