Saturday, December 27, 2025
[t4b-ticker]

*ఫెయిల్ అయినా పర్వాలేదు….!!*

*ఫెయిల్ అయినా పర్వాలేదు….!!*

కోదాడ,ఫిబ్రవరి 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కంప్యూటర్ యుగంలో యువతరానికి
‘స్టేవ్ జాబ్స్ ‘ పేరు సుపరిచితమే. జాబ్స్ కళాశాల విద్య ను మధ్యలోనే ఆపేసాడు దీనిక్కారణం చదువు సరిగా అబ్బకపోవటం!!అలాంటి వ్యక్తి కంప్యూటర్ రంగంలో ప్రవేశించి క్రమక్రమంగా యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకునిగా ఎదిగాడు

ఆధునిక జీవనంలో అంతర్బాగమైన ఫేసుబుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకెంబర్గ్
సాధారణ విద్యార్థి. చదువులో రాణించక పరీక్షల గండం కష్టంగా గట్టేక్కిన సందర్భాలు ఉన్నాయి.

*ఓటమిని చెప్పుకోవచ్చు..!!*

కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపారాత్మకంగా ఒకటి… ఒకటి… ఒకటి… రెండు.. రెండు… అంటూ ఉదరకొట్టే ప్రచారం చేస్తూ ఆకర్షిస్తాయి.తద్వారా మార్కులు ర్యాంకులు పెరిట హంగామా చేస్తుంటారు.

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని చెప్పుకోలేక కుంగిపోతున్నారు.

కొందరు తమ ఓటమిని బాహటంగా ప్రకటించుకుంటున్నారు

ప్రముఖ పారిశ్రామికవేతలు ప్రతాప్ రెడ్డి,ఇన్ఫోసీస్ నారాయణరావు తమ వైఫల్యాలను “Why I Failed”
అనే పుస్తకంలో వ్యక్తపరిచారు.
మన వైఫల్యాలు ను గుర్తిస్తే విజయం సిద్దించినట్లే గుర్తుంచుకోవాలి

*నా బాల్యస్నేహితుడు అన్నీ సబ్జక్ట్స్ లో మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.నేను అత్తసరు మార్కులు కూడా పొందలేక ఇబ్బంది పడేవాడిని. అతనిపుడు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి. నేను ఆ సంస్థకి యజమానిని. ఇప్పుడు కూడా ఓటమిని చులకనగా చూస్తారా!!”బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు*

*తల్లిదండ్రులతీరు మారాలి*

తమ పిల్లలపట్ల తల్లిదండ్రులు ఆశలు, అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారి మీద తీవ్ర ఒత్తిడిని పెంచటం తీవ్ర అక్షేపనీయం.
“”మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారు “
అనే ప్రశ్న మీద సర్వే చేస్తున్నారు.
భారతదేశం ప్రజలు
75%మంది మా పిల్లల కారిర్ లో విజయం సాధించాలి అని తెలిపారు.అదే కెనడా దేశ ప్రజలు 75%”మా ఆనందంగాఉండాలి “
అని తెలిసింది.

*తక్కువ మార్కులు పొందటం శాపం కాదు:మానసిక వికాస నిపుణులు చారుగుండ్ల రాజశేఖర్*
        
పేదరికం కారణంగా మరియు అంతగా ఆసక్తి లేకపోవటం వల్ల పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో ద్వితీయ శ్రేణులో ఉత్తీర్ణత సాధించుట జరిగింది.ఎన్నో కష్టాలు,ఇబ్బందులు ఎదుర్కొన్నాను.ఆ తర్వాత ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రులు సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో టాపర్ గా నిలిచాను.గోల్డ్ మెడల్ సాధించాను. ఆసక్తిని పెంచుకొని వివిధ యూనివర్సిటీ ల నుంచి 6 PG లు చేశాను.నిత్య విద్యార్థిగా చదువు కొనసాగిస్తున్నాను.
      విద్యార్థులకి
“ప్రేరణ వికాసం ” కల్గించాలనే సదుద్దేశంతో
‘విజయీభవ పేరిట 5లక్షల మందికి పైగా వ్యక్తిత్వ వికాస పాఠాలు,2000 ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నేను తెలుసుకున్న సమాచారం ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి ఆత్మవిశ్వాసం పెంచేలా విద్యభివృద్ధి కి కృషి చేస్తున్నాను.

*అన్నీ సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయి గ్రూప్ వన్ ఉద్యోగిగా రానిస్తున్నాను:అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ (ఎక్సైజ్)ఉస్తెల సోమిరెడ్డి*

నేను ఇంటర్ లో ఎంపీసీ లో చేరాను.అవగాహన లేక, సైన్స్ సబ్జక్ట్స్ మీద ఆసక్తి లేక మొదటి సంవత్సరం లో 5సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత HEC లో చేరి, BA లో గోల్డ్ మెడల్, MA లో గోల్డ్ మెడల్ సాధించాను. క్రమక్రమంగా రాణించి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాను. అంతేకాకుండా “మీలో ఎవరు కోటీశ్వరుడు”లో కోటి రూపాయలు ప్రశ్న ఎదుర్కొన్నాను.టైటిల్ ని మెగాస్టార్ చిరంజీవి గారిచేత అభినందనలు పొందాను. ఇంటర్ లో ఫెయిల్ అయి జీవితం విజేతగా నిలిచాను.

మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నంబర్ 9666358480 కి పంపించగలరు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular