కోదాడ,ఫిబ్రవరి 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావుపై ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా హైదరాబాదులో కలిసి పూల బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిఎసిఎస్ అభివృద్ధికి కృషిచేసి రైతులకు సకాలంలో రుణాలు అందిస్తానని అన్నారు.



