కోదాడ,ఫిబ్రవరి 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం మోతే మండలం హుస్సేన్ బాద్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు.

శ్రీ అభయాంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం హనుమాన్ యూత్ సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు,ఎంపిటిసి ఉషా సంజీవ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు సుధాకర్,దేవుల లచ్చయ్య,లింగయ్య,బైరపంగు సుధాకర్,ఆల్దాస్ వెంకన్న,హనుమాన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



