కోదాడ,మార్చి03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డిఓ సూర్యనారాయణ.అనంతరం ఆయన మాట్లాడుతూ మీ దగ్గరలో ఉన్న పోలియో కేంద్రానికి వెళ్లి ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఇది మీ బిడ్డ యొక్క భవిష్యత్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు.పోలియో చుక్కలు వేయించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పిల్లలకు వేయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, ఆర్డీవో సిసి విక్రంమ్,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలు పల్స్ పోలియో వేయించుకోవాలి:ఆర్డిఓ సూర్యనారాయణ
RELATED ARTICLES



