హైదరాబాద్,మార్చి 7(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో పల్లె దావకాన లో విధులు నిర్వహిస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులకు గత మూడు నెలల నుండి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున గురువారం హైదరాబాద్ కోటి లోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ నీ కలిసి వినతి పత్రం అందజేసినారు.అంతేకాకుండ ఎంఎల్ హెచ్ పీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఆయుర్వేదిక వైద్యులను మెడికల్ ఆఫీసర్ హోదాలోకి మార్చాలని కమిషనర్ ని కోరగా కమిషనర్ స్పందించి వీలైనంత త్వరలో మీ జీతాలు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటామని,అంతేకాకుండా మెడికల్ ఆఫీసర్ హోదాగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరేందర్ నాథ్,డాక్టర్ అరుణ్ కుమార్,డాక్టర్ విజయ్,డాక్టర్ స్వాతి తదితర డాక్టర్లు పాల్గొన్నారు
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ కలిసిన తెలంగాణ పల్లె దావకాన ఆయుర్వేదిక వైద్యులు
RELATED ARTICLES



