హుజూర్ నగర్,మార్చి 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మేళ్ళచెరువులో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.గుడి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను,వాటర్ ట్యాంకులను ప్రారంభించి ఆలయంలో,బయట భక్తుల కొరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు.టికెట్ల రేట్లు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులేకుండా శీఘ్ర దర్శనం కల్పించాలని,అదేవిధంగా ఎద్దుల పందాల కోర్టును,కబడ్డీ కోర్టులను కలెక్టర్ పరిశీలించారు.జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే జాతరను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో అప్పారావు,ఆర్డిఓ,ఇరిగేషన్ అధికారులు ప్రేమ్ చంద్,నరసింహారావు,దేవాలయ ఈవో కొండారెడ్డి,తహసిల్దార్ జ్యోతి,అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.
జాతర ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.
RELATED ARTICLES



