కోదాడ,మార్చి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోనీ కోదండ రామాలయంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత బోలా లింగేశ్వర స్వామి ( శివాలయం) వారి ఆలయ ధ్వజస్తంభమును దానికి ఇత్తడి తొడుగులు,స్వామివారికి వెండి ఆభరణాలను శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయ ధర్మకర్త నాగు బండి రంగాకు అందజేసినట్లు దాతలు శారద రాజశేఖర్ వారి కుమారులు సూర్యవంశీ శివ దత్తులు తెలిపారు.కోదాడ పట్టణంలో ప్రతిష్ట మహోత్సవం జరుపబోతున్న కోదండ రామాలయం లో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత బోలా లింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆలయ ద్విజ స్తంభం,ఇత్తడి తొడుగు స్వామివారికి వెండి ఆభరణాలను గన్నవరపు శారద రాజశేఖర్ లు కోదండ రామాలయ ప్రతిష్ట ఉత్సవ నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయ పునర్ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఆలయ ధర్మకర్తలు నాగు బండి రంగా మాట్లాడుతూ శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాపన మహోత్సవంలో ఈ ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ప్రజలందరినీ కోరారు.ఈ కార్యక్రమంలో ప్రతిష్ట ఉత్సవ నిర్మాణ కమిటీ సభ్యులు పైడిమరి వెంకటనారాయణ,పైడిమర్రి నారాయణరావు,గరిడేపల్లి లక్ష్మణరావు,పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శివాలయానికి ధ్వజస్తంభం,ఇత్తడి తొడుగు,స్వామివారికి వెండి ఆభరణాల భాహుకరణ:గన్నవరపు శారద రాజశేఖర్.
RELATED ARTICLES



