కోదాడ,మార్చి 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్చి 16వ తేదీన జరగబోవు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పాల్గొంటున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అన్నారు.
కోదాడ పట్టణంలోని మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ నివాసములో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం 2014 ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి మాదిగలకు న్యాయం చేస్తానని నమ్మబలికి గద్దె నెక్కిన నాటి నుండి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి మాదిగలు చెపుతారని అన్నారు ఇప్పటికైనా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ధమాషా ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ మాట్లాడుతూ మాదిగలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని మాదిగలంతా ఏకం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నూకపంగు ఈదయ్య,బిఎస్పి జిల్లా నాయకులు పిడమర్తి దశరథ,కొత్తపల్లి ఉపేందర్,చింతా కుమార్,భూపతి,దుర్గ,ఇటుకల మధు,కత్తి భగత్,రాము,వంశీ తదితరులు పాల్గొన్నారు.
మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు
RELATED ARTICLES



