కోదాడ,మార్చి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రేపు (13మార్చి) 01.30 PM – కోదాడ మండలం,రెడ్ల కుంట గ్రామంలో రెడ్ల కుంట & ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల శంఖుస్థాపన కార్యక్రమం కోదాడ ఎమ్మెల్యే పద్మా వతి రెడ్డి సభాధ్యక్షుతన జరుగును.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విచ్చేయుచున్నారు.
రూ 47.54 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయ బడుతున్న రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 4460 ఎకరాలకు సాగు నీరు అందించబడుతుంది.ఈ పథకం ద్వారా రెడ్ల కుంట,నల్లబండ గూడెం, కాపుగల్లు గ్రామాలకు లబ్ది చేకూరుతుంది.రూ 5.30 కోట్లతో ఉత్తమ్ పద్మావతి శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్దరణ.దీని ద్వారా 5వేల ఎకరాలకు సాగు నీరు అందించ బడుతుంది. ఈ పథకం ద్వారా శాంతి నగర్,గోండ్రియాల,బొజ్జగుడెం తండా,మొగలాయి కోట, అన్నారం,లక్కారం,తమ్మరబండ పాలెం,చిమిర్యాల,కొత్త గూడెం,నల్లబండ గూడెం గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
13 మార్చిన నీటిపారుదల&పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలు
RELATED ARTICLES



