Saturday, December 27, 2025
[t4b-ticker]

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,మార్చి 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం కాపాడిన వారమవుతామని,ప్రతి మూడు నెలలకు ఒక సారి రక్తదానం చేయవచ్చునని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలోని 25 వార్డు నందు
తలసేమియా,డయాలసిస్‌ రోగుల సహాయార్థం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నాయకులు వేముల కోటేశ్వరరావు తన బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్తం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని,ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో 25 వార్డ్ ఇంచార్జ్ చింతల నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అల్వాల వెంకటేశ్వర్లు,చింతల లింగయ్య,కోదాటి కృష్ణయ్య,బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్,రక్తదానం చేస్తున్న యువకులు,పార్టీ కార్యకర్తలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular