కోదాడ,మార్చి 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దొరకుంట గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌడం హనుమంతరావు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ప్రజలు త్రాగునీటి కొరకై పడుతున్న ఇబ్బందులను గమనించి ఉచితంగా మంచినీటి ట్యాంకర్ ప్రారంభ కార్యక్రమాన్ని శ్రీరాం ఫౌండేషన్ అధ్యక్షులు చౌడం హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని మంచినీటి ట్యాంకర్ ను ప్రారంభించి మాట్లాడుతూ గ్రామంలో తాను ఇప్పటికే మంచినీటి సమస్యలను తీర్చేందుకు నిధులు మంజూరు చేశానని ప్రభుత్వానికి తోడుగా ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌడం హనుమంతరావు గ్రామంలో ఇప్పటికే తన సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశ్వర్లు,మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,పారా సీతయ్య,ఎంపీపీ మల్లెల రాణి, జడ్పిటిసి కృష్ణకుమారి,తొండపు సతీష్,మాజీ సర్పంచ్ గద్దల వెంకటేశ్వర్లు,ఖలీల్,గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
సొంత ఖర్చులతో ప్రజలకు త్రాగునీరు అందించడం అభినందనీయం:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
RELATED ARTICLES



