కోదాడ,మార్చి14(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది ఎదుటివారి ప్రాణాలను కాపాడటం భగవంతునితో సమానమని ఎంబిఎం ట్రస్టు నిర్వాహకులు అన్నారు. కోదాడ వైష్ణవి హాస్పిటల్ లో కాసాని దివ్య ఎర్రవరం గ్రామం వారికి అత్యవసర ఆపరేషన్ నిమిత్తం బ్లడ్ తక్కువగా ఉండడంతో అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో వారు ఎంబిఎం గ్రూప్ వారిని సంప్రదించగా ఎంబిఎం గ్రూపు సభ్యులైన అనంతగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జి రవీంద్రనాథ్ వారికి బ్లడ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా సామాజిక సుహా పెంపొందుతుందని తెలిపారు.ఎంబిఎం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.



