హుజూర్ నగర్,మార్చ్15(ఎంబిఎం తెలుగు న్యూస్)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10, వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమము ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ ట్రెసరరీ ఆఫీసర్ (ఎస్టిఓ) కుమారి సావిత్రి ముఖ్య అతిదిగా విచ్చేసి పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.అనంతరం ఆమె విధారులతో మాట్లాడుతూ మీరు కష్టపడి చనివి మంచి జిపిఏ సాధించాలని,చదువుకున్న పాఠశాలకు,మీ తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరినారు.

ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు పరుచూరి జయవాణిదేవి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసి మాటాడుతూ పరీక్షలు రాసే సమయంలో ఆందోళన చెందకుండ మనోధైర్యముతో పరీక్షలు రాసి ఎక్కువ జిపిఏ సాధించాలని అన్నారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,మాతంగి ప్రభాకర్ రావు,శ్రీదేవి,ప్రసాద్, విజయలక్ష్మి,దీనరాణి,అరుణ రాణి,శేషగిరి,వసంతరావు, అన్వేష్,ఆస్మా ముబీన్,అశోక్ కుమార్,మున్నీ బేగం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



