కోదాడ,మార్చి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాపుగల్లు కూచిపూడి మధ్యలో గల పంట పొలాలలో రైతులు తమ పంట వ్యర్ధాలకు పెడుతున్న నిప్పు పచ్చని హరితహారం చెట్లను బుగ్గిపాలు చేస్తున్నాయి..అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి చెరువులు బావులు పూర్తిగా ఎండిపోయాయి నీరు కూడా దొరకని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం పర్యావరణానికి హానిచేస్తుంది.నానాటికి అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నటువంటి సందర్భంలో ఎంతో శ్రమించి రోడ్ల పక్కన నాటిన మొక్కలు ఇప్పుడిప్పుడే చెట్లుగా మారుతున్న తరుణంలో వాటి గురించి జాగ్రత్తలు తీసుకొని చెట్లు పెరిగేలా చేయాల్సింది పోయి ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చెట్ల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి, ప్రభుత్వం కూడా ఈ చెట్లను పట్టించుకోవడం మానివేసింది, ఎండాకాలం ట్యాంకర్ తో నీరు పోసి రక్షించాల్సిన సమయంలో ప్రభుత్వ అధికారులు వాటిని వదిలేసారు పైగా రైతులు చేస్తున్న ఇలాంటి పనులు చేసిన శ్రమనంత వ్యర్థం అయ్యేలా చెట్లను కాల్చివేస్తున్నాయి.. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టడాన్ని ఆపివేసేలా చర్యలు తీసుకోవాలి అలాగే ట్యాంకర్లతో చెట్లకు నీటిని సరఫరా చేసి అవి ఎండాకాలం అంతా బ్రతికేలా చూడాలని స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చెరుకుపల్లి కిరణ్ స్వేరో తెలిపారు.
పంట వ్యర్ధాలకు నిప్పు పెడుతున్న రైతులు.. బుగ్గి పాలవుతున్న హరితహారం చెట్లు
RELATED ARTICLES



