కోదాడ,మార్చి 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కొమరబండ గ్రామంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 93వ,వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ యువకిశోరాలు భగత్ సింగ్ రాజగురు సుఖదేవులని,భరతమాత స్వేచ్ఛా సంకెళ్లను తెంచ 23 సంవత్సరాల చిన్నవయసులోనే చిరునవ్వుతో ఊరి కొయ్యలు ముద్దాడి పోరాట స్ఫూర్తిని రగిలించిన అరుణ తారలు అని కొనియాడారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.కులాల పేరుతో మతాల పేరుతో ప్రజలను విభజించి విద్వేషాలను రెచ్చగొట్టి తాము అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి ఉందన్నారు.సంపన్న వర్గాలకు బహుళ జాతి కంపెనీలకు దేశ సంపదను తాకట్టు పెట్టి ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాదఫాసిస్టు విధానాలపై భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మద్దెల వెంకన్న, ప్రతాప్,కామల్ల సైదులు,జానయ్య, మద్దెల అశోక్,రాజారావు,అనంతరావు, శంకర్,బుచ్చిబాబు,శ్రీను,సింహాద్రి,నరేష్,రవి తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు!
RELATED ARTICLES



