కోదాడ,మార్చి 25 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం కుల,మతాలకు అతీతంగా చిన్నా,పెద్ద,ఆడ,మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ అని రిటైర్డ్ టీచర్ చిల్లంచర్ల వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం భవాని నగర్ ముడియాల భారత రెడ్డి వీధిలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్లంచర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి హోలీ పండుగని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ రంగులు చల్లుకుంటారని అన్నారు.

హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆనందాలు వెళ్లివిరియాలని కోరారు.ఈ పండుగను ప్రజలు పువ్వులతో,రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.ఇలా రంగులు,పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ,సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారని అన్నారు.హోలీ పండుగ సహజమైన రంగులతో జరుపుకోవాలని అన్నారు.హోలీ అనంతరం స్నానాలకు బావుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితమైన ప్రాంతాలలోని స్నానాలు ఆచరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చిల్లంచర్ల నాగలక్ష్మి వెంకటేశ్వర్లు, చిట్లా స్ఫూర్తి శ్రీకాంత్ రెడ్డి,తాటి మానస,సీత,సఫియా,మాతంగి గగన్ తేజ్,చైతన్య రెడ్డి,భవిత్ రెడ్డి,నాగేంద్ర,తాటి సంజయ్,నవనీత్,పొనుగోటి భువనేష్,మోక్షిత్ రామ్,ధనుంజయ్,తేజశ్రీ,బూన తదితర భవానినగర్ పిల్లలు పాల్గొన్నారు.



