కోదాడ,మార్చి 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పెట్రోలియం డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో మౌన ప్రదర్శన నిర్వహించారు ముందుగా గుడిబండ రోడ్డు లో గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రమేష్ మాట్లాడుతూ తాము దశాబ్దాల కాలంగా పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నామన్నారు వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సేవలను సదుపాయాలను అందిస్తున్నామన్నారు తమకు ఆయిల్ కంపెనీలు చెల్లిస్తున్న కమిషను గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి పెంపుదల లేకుండా చెల్లిస్తున్నారన్నారు బంకులలో నిర్వహణ ఖర్చులు విద్యుత్ చార్జీలు తదితర ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం తమకు వచ్చే కమిషన్ సరిపోవడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కమిషను పెంచడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం డీలర్లు నోటికి నల్ల వస్త్రాన్ని కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో డీలర్లు గరినే శ్రీధర్,వంగవీటి లోకేష్ గన్నవరపు నాగరాజు,శేషు,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు
సమస్యలను పరిష్కరించాలంటూ మౌన ప్రదర్శన……….
RELATED ARTICLES



