కోదాడ,మార్చి 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:”విద్యతో నాస్తి దుర్భిక్షం” విద్యతోనే జీవితంలో సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తికి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మరక్షణతో పాటు సామాజిక,ఆర్థిక,రాజకీయ,ఉద్యోగ,ఉపాధి అవగాహనలు సాధ్యం అవుతాయని కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మీ మల్లేష్ అన్నారు.బుధవారం స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణంలో డా॥ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం(ఆస్క్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత కోచింగ్ సెంటర్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ వి మల్లేష్ పాల్గొని కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ విద్యతోనే ప్రపంచస్థాయి మేధావి అయినారు.వారి మార్గంలో పయనిస్తూ వారి ఆశయసాధనకై “ఆస్క్” స్థాపించబడిందని అన్నారు. 2012 సంవత్సరంలో స్థాపించబడి అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఆస్క్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.అనంతరం ఆస్క్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అనంతరం ఉన్నత చదువులు చదవడానికి అవసరమైన “పాలిసెట్,టీఎస్ఆర్జెసి పోటీ పరీక్షలకు సిద్ధం చేసే బాధ్యత తీసుకున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కుడుముల స్వామి దాస్,ఏఎస్ఐ కొంగల వెంకటేశ్వర్లు,పిడమర్తి వెంకటేశ్వర్లు,గంధం బుచ్చారావు,ఎలమర్తి శౌరి,చెరుకుపల్లి కిరణ్,మాగి గురవయ్య,అమరబోయిన వెంకటరత్నం,సోమపంగు శ్రీనివాసులు,మీసాల వెంకటరమణమ్మ,చేకూరి రమేష్,భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత పాలిటెక్నిక్,టిఎస్ఆర్జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ వి మల్లేష్
RELATED ARTICLES



