:59 ఓట్ల భారీ మెజారిటీ తో విజయం.
:పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు
కోదాడ,మార్చి 28(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ న్యాయవాది శ్రీనివాసుల రాధాకృష్ణ మూర్తి (ఎస్ ఆర్ కె మూర్తి ) ఎన్నికయ్యారు.గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఆయన 59 ఓట్ల మెజారిటీతో నాళం రాజన్న పై విజయం సాధించారు.మొత్తం 106 ఓట్లు పోల్ కాగా అందులో ఒక ఓటు చెల్లలేదు. ఎస్ ఆర్ కె మూర్తి కి 82 ఓట్లు రాగా రాజన్నకు 23 వోట్లు వచ్చాయి.అదే విధంగా క్రీడా కార్యదర్శిగా పోలురి హేమలత 18 ఓట్ల మెజారిటీ తో,1వ కార్యవర్గ సభ్యుడు గా దొడ్డ శ్రీధర్ 8 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వేజర్ల రంగారావు,ఉప ఎన్నికల అధికారి షేక్ జానీ పాషా,సహాయ ఎన్నికల అధికారి ఆవుల మల్లికార్జునరావు లు తెలిపారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎస్ ఆర్ కె మూర్తి విజయం సాధించడం తో న్యాయవాదులు తమ అభిందనలు తెలిపారు.బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.నూతన కార్యవర్గం….
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఎస్ ఆర్ కె మూర్తి,ఉపాధ్యక్షుడిగా గట్ల నర్సింహారావు,ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల రామిరెడ్డి,సంయుక్త కార్యదర్శి గా సరికొండ హనుమంత్ రాజు,కోశాధికారిగా కోడూరు వెంకటేశ్వర రావు,గ్రంధాలయ కార్యదర్శిగా మందా వెంకటేశ్వర్లు, క్రీడా కార్యదర్శిగా పోలూరి హేమలత,మహిళా ప్రతినిధిగా ఓరుగంటి ధనలక్ష్మి,కార్యవర్గ సభ్యులుగా దొడ్డ శ్రీధర్,సామా నవీన్ కుమార్,షేక్ నాగుల పాషా లు ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,దేవబత్తిని నాగార్జున రావు,మేకల వెంకట్రావు,ఎలక సుధాకర్ రెడ్డి ,పాలేటి నాగేశ్వర రావు,రామిశెట్టి రామకృష్ణ,పగడాల రామచంద్రా రెడ్డి,కాకర్ల వెంకటేశ్వర రావు,సాధు శరత్ బాబు,ఈడుల కృష్ణయ్య,గాలి శ్రీనివాస్ నాయుడు లు తమ అభినందనలు తెలిపారు.ఎన్నికలు ప్రశాంతం జరిగేందుకు సహకరించిన న్యాయవాదులు అందరికీ ఎన్నికల అధికారులు తమ కృతజ్ఞతలు తెలిపారు.



