హుజూర్ నగర్,మార్చి 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉచిత పాలిటెక్నిక్,టీఎస్ఆర్జెసి ప్రవేశ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులుఉన్నత శిఖరాలను అధిరోహించాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి బి సైదా నాయక్ అన్నారు.గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఆధ్వర్యంలో కోదాడ ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించే పాలిటెక్నిక్,టిఎస్ఆర్జెసి ప్రవేశాలకు ఉచిత శిక్షణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని (ఆస్క్) ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి బి సైదానాయకు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన విద్యార్థుల కోసం 2012 సంవత్సరం నుండి అనేక పోటీ పరీక్షలకు పోలీస్,విఆర్ఓ,ఆర్ అండ్ బి,పాలిటెక్నిక్,టిఎస్ఆర్జెసి వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం నిర్వాహకులను అభినందించారు.ఇలాంటి ఉచిత కోచింగ్ సెంటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,సభ్యులు నందిపాటి సైదులు,,కస్తాల సునీల్ కుమార్,సూరేపల్లి దేవుడు,ప్రభుత్వ పాఠశా ప్రధానోపాధ్యాయురాలు జయవాణిదేవి,ఉపాధ్యాయులు,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,శ్రీదేవి,ప్రసాద్,దీనారాణి,బిఎల్ అరుణ,శేషగిరి,అస్మామ్ బీన్,అన్వేష్,శైలజ,వసంతరావు,రవీందర్ రెడ్డి,శేఖర్,నాగేశ్వరరావు,శ్రీకాంత్,మున్ని బేగం తదితరులు పాల్గొన్నారు.
ఉచిత పాలిటెక్నిక్ టిఎస్ఆర్జెసి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి:మండల విద్యాధికారి బి సైదా నాయక్
RELATED ARTICLES



