కోదాడ,మార్చి 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి అనుగ్రహముతో కోదాడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోదాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయ శిలాన్యాసము శంకుస్థాపన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేళ్లచెరువు కోటేశ్వరరావు,పైడిమర్రి వెంకటనారాయణ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధు,మునగాల మండల పార్టీ అధ్యక్షులు రమేష్,బిఆర్ఎస్ నాయకులు,భక్తులు,కాలనీ వాసులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి అనుగ్రహముతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి:కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



