చిలుకూరు,మార్చి 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్ ) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకలరాజు శ్రీను పిలుపునిచ్చారు.శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ మండల ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ….దేశంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక మతం పేరుతో….దేశం చీలిపోయిందని,ఇది అత్యంత బాధాకరమైన చర్య అని భారతీయులందరూ సోదరీ సోదర భావంతో మెలగాల్సిన తరుణంలో హిందువునని గర్వించు…హిందువుగా జీవించు అంటూ యువతను రెచ్చగొట్టి సమాజాన్ని బీటలు వారుస్తున్నారని,కులం పేరుతో,మతం పేరుతో,ప్రాంతం పేరుతో,భాష పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు రెచ్చకొట్టడం అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు.సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో నమ్మబలికి రెండుసార్లు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అధికారం అనుభవించి 10 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.దేశ సంపదనంతా అంబానీ ఆదానీ లాంటి కార్పోరేటర్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని దివాలా తీయించారని ఆయన దుయ్యబట్టారు.గత ఎన్నికల్లో పుల్వామా ఘటనలు ముందు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల గోదాలోకి దిగారని అయితే పుల్వామా నిందితులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని అక్కడికి పేలుడు సామాగ్రి ఎలా వచ్చిందో ఇంకా ఎందుకు తేల్చలేకపోయారని ఆయన అన్నారు.మళ్లీ ఇప్పుడు రామ మందిరం అంశాన్ని ముందుకు తెచ్చి ఎన్నికలకు వస్తున్నారని,నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేని వాళ్లకు రైతు పండించిన పంటకు గిట్టుబాటు దరకు చట్టబద్ధత కల్పించలేని వాళ్ళకు ఓటు అడిగే నైతిక అర్హత ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ఎస్బిఐ విడుదల చేసిన లెక్కలు 12 వేల కోట్లు అని చెబుతుంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ విలువ 20వేల కోట్లు అని అమీత్ షా అంటున్నాడని మిగిలిన 8000 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో ప్రధాని మోడీ దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షుడు అనంతుల రాము,కార్యదర్శి కడారి మధు,కిషోర్ రవి తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి:చిలక రాజు శ్రీను
RELATED ARTICLES



