తెలంగాణ,ఏప్రిల్ 1(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్ లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనీ,వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు.నిజానికి ఇదేమీ వ్యాధి కాదు.కొన్ని ఇతర ఆరోగ్య సమ స్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో,అందుకు కారణ మయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ,చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం.
రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె.ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు.ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు.గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్త రిస్తుంది.కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా… మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం,చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు.ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది.
*కారణాలు*
గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకా ర్డైటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫె క్షన్లు.
• గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బ తినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం.
• గుండె చుట్టూరా ఉండే ఒక పొర లోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూ జన్ అంటారు.దీన్ని ఎక్స్-రే ద్వారా కనుగొంటారు.
• రక్తహీ నత వల్ల అన్ని అవయవా లకూ ఆక్సిజన్ తగినంతగా అందదు.అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో.మహిళల్లో గర్భధా
రణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల.కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి).
• దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో
• థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కు వగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడి వైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవా రిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది.
• కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు.

*లక్షణాలు*…శ్వాస సరిగా అందకపోవడం
• కాళ్ల / పాదాల వాపు బరువు పెర గడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో… సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట
• కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం.
*నిర్ధారణ పరీక్షలు*: కొన్ని రక్తపరీక్షలు,ఛాతీ ఎక్స్-రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్,ట్రెడ్మిల్పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ.
*చికిత్స*… గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు.ఉదాహరణకు… గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీ జ్లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా రక్తపోటును నియం త్రించే
మందుల్ని వాడటం ద్వారా.గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా
• మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా.
*ఇతర మందుల వాడకంతోనూ*… కాళ్లవాపులు అధికంగా ఉన్న ప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై-యూరెటిక్స్
• రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో.
• రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్.
• గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు.
• గుండె కొట్టుకో వడం ఆగితే ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్ తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు.
• గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్మేకర్’ అమర్చడం ద్వారా.లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్బీఏడీ) అనే ఉపకర ణాన్ని.. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసర మైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు… గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్)
చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో… . చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్)
చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు.



