కోదాడ,ఏప్రిల్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక తేజ టాలెంట్ స్కూల్ నందు చిల్డ్రన్ కార్నివాల్ పేరుతో వార్షికోత్సవమును ఘనంగా నిర్వహించారు.పిల్లల పండుగ పేరుతో ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోతుగంటి నాగేశ్వరరావు,రామచంద్ర మిషన్ జోనల్ కో ఆర్డినేటర్ చిట్టబత్తిని వరప్రసాద్,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,సత్యమేవ జయతే సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాలకృష్ణ,ఫౌండర్ డైరెక్టర్ సోమిరెడ్డిలు పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమము అత్యంత ఉత్సాహభరితంగా,ఆనందముగా నిర్వహించబడింది,దేశభక్తి గేయాలు,జానపద నృత్యాలు,ప్రజలకు ఆరోగ్యం విషయంలో పరిశుభ్రత విషయంలో కూల్డ్రింక్స్ నిషేధం గురించి,తల్లిదండ్రుల ఆలనా పాలన,వృద్ధాశ్రమాలు,అనే స్కిట్ ద్వారా మెసేజ్ అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు ఇన్చార్జిలు నవ్య,ఝాన్సీ,రామ్మూర్తి,సోమనాయక్,పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్,ప్రిన్సిపాల్ అప్పారావు ఉపాధ్యాయులు రేణుక,పద్మజ,కృష్ణవేణి,పావని,రమేష్,వెంకటేశ్వర్లు,సరిత ఇతర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.



