కోదాడ,ఏప్రిల్ 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గత ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులు ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వంలో అయినా వారి జీవితాలలో వెలుగులు నిండుతాయని గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం కూడా గతపాలకుల ధోరణే అవలంబించడం శోచనీయం అని మాదిగ జేఏసీ జాతీయ నాయకులు తోట కమలాకర్ అన్నారు.గతంలో టెట్ ఫీజు రెండు పేపర్లను కలిపి 400 అంటే ఒక్కొక్క పేపర్ కు 200 చొప్పున ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి నిరుద్యోగులు ఎంతో ఇబ్బందిపడినారు అన్న విషయం తెలిసినదే అని అన్నారు.నేడు ప్రజా ప్రభుత్వం మాత్రం రెండు పేపర్ లకు కలిపి 2000 అంటే ఒక్కొక్క పేపర్ కు 1000 రూపాయలు నిరుద్యోగుల దగ్గర వసూలు చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుందని అన్నారు.ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే పెంచిన టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని మాదిగ జేఏసీ జాతీయ నాయకులు తోట కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు కొర్రి పెడుతున్న ప్రజా ప్రభుత్వం:తోట కమలాకర్
RELATED ARTICLES



