కోదాడ,ఏప్రిల్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఇస్తున్న పాలెటెక్నిక్,టీఎస్ఆర్జెసి పోటీ పరిక్షలకు ఉచిత శిక్షణను, విద్యార్థులు సదిృచియోగం చేసుకోవాలని ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నాయి. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని ఆస్క్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ 2012 నుండి ఆస్క్ ఉచిత శిక్షణ సేవలు అందిస్తుందని ఎందరో విద్యార్థులు శిక్షణ పొంది మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో సీట్లు సాధించుకున్నారు వారిని చూసి మేమెంతో సంతోషించామని తెలిపారు.

ఈ శిక్షణ లో ఉచితంగా తరగతులు చెప్పడానికి ముందుకు వచ్చిన విషయ నిపుణులను అభినందించారు.ఈ ఉచిత శిక్షణకు కుడుముల స్వామి దాస్ కుమారుడు రవి 15 వేల రూపాయలు కలకొండ వెంకటరత్నం 5000 రూపాయలు ఆస్క్ సంస్థకు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం నిర్వాహకులు మాతంగి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారి వారి సమయాన్ని వెచ్చించి సంస్థకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎలమర్తి శౌరి,కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు,బొడ్డు హుస్సేన్,ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రమేష్,నందిపాటి సైదులు,జొన్నలగడ్డ ప్రసాద్,కిరణ్,దేవుడు,పెడమర్తి వెంకటేశ్వర్లు,అమరబోయిన గోపి,ఈ కిరణ్,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



