కోదాడ,ఏప్రిల్ 05(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ సేవలు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్టు సభ్యులు అన్నారు.శుక్రవారం స్థానిక రంగా దియేటర్ ముందు ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైటెక్ చలివేoద్రం వద్ద దాత చీదెళ్ల కృష్ణమూర్తి ధర్మపత్ని వెంకట సుబ్బరత్నమ్మ కుటుంబ సభ్యులు(కుమారులు వెంకట సాంభశివ రావు,వెంకట సురేష్,వెంకట సతీష్)వారి ఆర్ధిక సహకారంతో 500 మందిపాదచారులకు,పేదలకు,,కార్మికులకు,వికలాంగులకు,వృద్ధులకు,మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు నుండి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కోదాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిర్వహిస్తున్నామని ప్రజలు కూడా మా కార్యక్రమాలను స్వాగతిస్తూ ముందుకు మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చీదేళ్ల వెంకట సాంబశివరావు,అధ్యక్షులు
గాదంశెట్టి శ్రీనివాసరావు,వైస్ ప్రెసిడెంట్
ఓరుగంటి కిట్టు,ట్రస్ట్ డోనర్ సభ్యులు,పుల్లఖండం సాంబశివరావు,గుడుగుoట్ల సాయి,వెంపటి ప్రసాద్,పైడిమర్రి రామారావు,కాళంగి వెంకటేశ్వర్లు,దేవరశెట్టి శంకర్,కందిబండ నాగేశ్వరరావు,కుక్కడపు శ్రీనివాసరావు,రంగా థియేటర్ స్టాప్ పాల్గొన్నారు.
స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ సేవలు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
RELATED ARTICLES



