నడిగూడెం,ఏప్రిల్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న సాగర్ ఎడమ కాలువ నిళ్లను రెవిన్యూ,పోలీసు,ఇరిగేషన్ డిపార్టెంట్ సిబ్బందిని పెట్టి నిర్బంధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు రిజర్వాయర్ కు నీటిని తరలించడం ప్రభుత్వానికి సరైంది కాదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోకన్వీనర్ పందిటి నవీన్ అన్నారు.పందిటి నవీన్ ఆధ్వర్యంలో సోమవారం నడిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ ప్రజలు సాగునీరు,త్రాగునీరు లేక బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకొని సాగర్ ఎడమ కాలవ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడి నుండి పాలేరు రిజర్వాయర్ వరకు ఇరువైపులా ఉన్న గ్రామాలకు లిఫ్టుల ద్వారా,తూముల ద్వారా గ్రామాలలో చెరువులు నింపి భూగర్భ జలాలను పెంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు త్రాగునీరు అందించాలని అన్నారు.అంతేకాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరొక జిల్లాకు నీరులు తరలించడం పద్ధతి కాదని ఎంఎస్ఎఫ్ హెచ్చరించింది. తక్షణమే ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించాలని వారు అన్నారు.అందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రజలను ఏకం చేసి ఆందోళనలో చేస్తామని తెలిపారు.
మాదిగ స్టూడెంట్ ఫెడెరెషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి పత్రం
RELATED ARTICLES



