కోదాడ,ఏప్రిల్ 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి అని ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ తనిఖీలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…
జాతీయ రహదారి 65 కు వచ్చి పోయే అన్ని గ్రామీణ రహదారులపై నిఘా ఉంచాలని అన్నారు.రూ.50 వేల కన్నా ఎక్కువ నగదును తీసుకువెళ్తే సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని,ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దుస్తులు,ఎలక్ట్రానిక్ పరికరాలను రవాణా చేస్తున్న ఆధారాలను పరిశీలించాలని కోరారు.చెక్ పోస్ట్ లో 24 గంటలు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి:ఆర్డిఓ సూర్యనారాయణ
RELATED ARTICLES



