కోదాడ,ఏప్రిల్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పాశం వీరస్వామి కుమారుడు పాశం నాగేశ్వరరావు గతం మూడు నెలలుగా కాలు నొప్పితో బాధపడుతూ మంచానికే పరిమితమైన సంగతి తెలిసి చౌడం శ్రీరామ్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు చౌడం హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశం నాగేశ్వరరావు కుటుంబం చాలా పేద కుటుంబం వారికి ఈ అంబేద్కర్ జయంతి రోజు సహాయం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.మా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ద్వారకుంట గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.రాబోయే రోజులలో కోదాడ ప్రాంతంలో ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడం శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చౌడం హనుమంతరరావు,మాజీ సర్పంచ్ గద్దల వెంకటేశ్వర్లు,భీమల బ్రహ్మం,పాలడుగు సైదులు,అమ్మ ప్రేమ అమృతం స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గోనెల వెంకటేశ్వర్లు,బూరెల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 5000 ఆర్థిక సహాయం చేసిన చౌడం శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్
RELATED ARTICLES



