కోదాడ,ఏప్రిల్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ఎమ్మెస్ కాలేజ్ వేదికగా నడుస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (అస్క్,ఉచిత కోచింగ్ సెంటర్) ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,ఆస్క్ సభ్యులు విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పోలేపాక పెంటయ్య పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశించిన సమసమాజ స్థాపన జరగాలని అది జరగాలంటే పేదలు అణగారిన వర్గాలు విద్యను ఆయుధంగా చేసుకొని,అన్ని సవాళ్లను ఎదిరించి అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.అంబేద్కర్ ఆశయాన్ని సాధించడానికి ఆస్క్ చేయూతనిస్తుందని కొనియాడారు.అనంతరం ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే నిరుపేదలకు ఉచితంగా కోచింగ్ ని అందించడానికి ఆర్థికంగా భారమైన ఆస్క్ ను కొనసాగిస్తున్నామని దీనిని ప్రతి పేద విద్యార్థి ఉపయోగించుకొని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య ఆస్క్ కి 5000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ డైరెక్టర్ ఎలమర్తి శౌరి,బొడ్డు హుస్సేన్,రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కుడుముల స్వామి దాసు,ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య,రమేష్,సర్వేయర్ నాగారపు నాగేశ్వర్ రావు,నందిపాటి సైదులు,ప్రధానోపాధ్యాయులు నందిగామ ఆనంద్,కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు,చెరుకుపల్లి కిరణ్,శ్రీకాంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



