హుజూర్ నగర్,ఏప్రిల్ 14(mtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్: గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ఒకే సిరా చుక్క తోటి కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన జ్ఞాన యోధుడు, స్త్రీల హక్కుల కోసం తన పదవిని సైతం త్రుణ ప్రాయంగా వదిలిన త్యాగధనుడు అంబేద్కర్ అని అన్నారు.చదువుతోనే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మహా మేధావి,వెలివాడలో బ్రతుకుతున్న జీవితాల్లో వెలుగులు నింపిన నీతి సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.యావత్తు దేశం కూడా ఆయన బాటలో నడవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేధావులు,ఉద్యోగులు ,అంబేద్కర్ ఐడియాలజిస్టులు,అంబేద్కర్ యూత్ సభ్యులు,అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పొనుగోడు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
RELATED ARTICLES



