కోదాడ,ఏప్రిల్ 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల చెరువులో చేపలు పట్టుటకు నీళ్లను మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్న సంబంధిత ఇరిగేషన అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు.గ్రామస్తులు ఏంటి అని అడిగితే గ్రామస్తులను లెక్కచేయకుండా నీళ్లకు మీరు ఇబ్బంది పడితే నేను చేపలు పట్టుకోవద్ద అనే సమాధానం చెబుతున్నారని గ్రామస్తులు అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోవడం వలన గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులలో నీరు ఎండిపోవడం వలన గ్రామస్తులు నీరు కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల మేర వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినది దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో కొంతమంది ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తుంటే చేపల వ్యాపారులు మాత్రం చెరువులలో నీళ్లను ఇష్టం వచ్చినట్లుగా వదులుతూ గ్రామ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి అలాంటి వారిపై తగు చర్యలు తీసుకున్నట్లయితే గ్రామంలో భూగర్భ జలాలు కొంతమేరైనా ఉండటానికి అవకాశం ఉంటుందని పలువురు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత ఆంధ్రా చేపల వ్యాపారి,ట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు
చెరువులలో వాటర్ లేకుండా చేస్తున్న చేపల వ్యాపారులు
RELATED ARTICLES



