కోదాడ,ఏప్రిల్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శ్రీరామనవమి సందర్భంగా చిలుకూరు మండల పరిధిలోని ఆచర్లగూడెం గ్రామంలో సారెడ్డి బిక్షం రెడ్డి జ్ఞాపకార్థం వారి మనవళ్లు అన్వేష్ రెడ్డి,అనుదీప్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,జెడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోదరులను అభిమానించే అన్నగా,భార్య ప్రేమ కోసం పరతపించిన భర్తగానూ శ్రీరాముడు స్థిరస్థాయిగా నిలిచిపోతాడని అన్నారు.ప్రజల సంక్షేమం కోసమే మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు అని అన్నారు.ఈ అన్నదానకార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిలుకూరు మండల ప్రజలకు,కోదాడ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు దేవాలయ అధ్యక్షులు అంబటి సైదిరెడ్డి,కార్యదర్శి బొలిశెట్టి నాగేంద్రబాబు,ఉపాధ్యక్షులు దుస్స రామ నర్సయ్య,సారెడ్డి నర్సిరెడ్డి,మాజీ సర్పంచి ముసి లక్ష్మీనారాయణ,బేరి తిరుపతయ్య,దుస్సా లక్ష్మీనారాయణ,సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మూసి శ్రీనివాస్,మైలారిశెట్టి వెంకయ్య,మైలారిశెట్టి రాంబాబు,దుస్సా చిన్న వీరయ్యడి వెంకటేశ్వర్లు,ఎం నాగేశ్వరరావు,వీరారెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ,జడ్పిటిసి
RELATED ARTICLES



