కోదాడ,ఏప్రిల్ 25 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆగి ఉన్న లారీకి కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన జిల్లా శ్రీకాంత్ కు బోనకల్లు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన నల్లమల నాగమణి తో ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయినది. మీరు ఇరువురికి జిల్లా లాస్య 5 సంవత్సరాలు జిల్లా లావణ్య 3 సంవత్సరముల పాపలు కలరు. శ్రీకాంత్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు రెండు సంవత్సరాల క్రితం తల్లిని కూడా కోల్పోయాడు శ్రీకాంత్ భార్య అయిన నాగమణి కుటుంబం శ్రీకాంత్ తమ్ముడు బతుకుదెరువు కోసం హైదరాబాదు వెళ్లి డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.శ్రీకాంత్ చిన్న పాప అయినా జిల్లా లావణ్య పుట్టి వెంట్రుకల నిమిత్తం విజయవాడలోని గుణదలకు గురువారం తెల్లవారుజామున హైదరాబాదు నుండి టీఎస్ 09 ఎఫ్ ఎఫ్ 7540 ఎర్టిగా కారులో బయలుదేరినారు.ఈ కారులో మొత్తం పదిమంది ప్రయాణిస్తున్నారు.పదిమందిలో నలుగురు చిన్న పిల్లలు ఆరుగురు పెద్దవారు ఉన్నారు.

కోదాడ పట్టణ పరిధిలోని బైపాస్ నేషనల్ హైవే 65 శ్రీరంగపురం వద్ద సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆగి ఉన్న టీఎస్ 05 యూసి 1389 లారీకి తగిలియడంతో కార్ లో ఉన్న ఆరుగురు మృతి చెందారు1,జిల్లా శ్రీకాంత్ వయస్సు 30 సం,,2,జిల్లా లాస్య వయసు 5 సం,,3,నల్లమల రామచంద్రరావు వయసు 52 సం,,4,నల్లమల మాణిక్యమ్మ వయసు 48 సం,,5,నల్లమల కృష్ణంరాజు వయసు 30 సం,,6,నల్లమల స్వర్ణ వయస్సు 28 సం,, లు అక్కడికక్కడే చనిపోయినారు.మిగతా నలుగురు 1.జిల్లా నాగమణి,2.జిల్లా లావణ్య,3.నల్లమల కౌశిక్,4.నల్లమల కార్తీక్ లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.చనిపోయిన వారు శ్రీకాంత్ కు కూతురు,అత్త,మామ,బామ్మర్ది,బామ్మర్ది భార్యలు ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడంతో ఆ కుటుంబీకులు లబోదిబోమంటున్నారు. కార్ ఆక్సిడెంట్ అయన సమయంలో కారును నల్లమల కృష్ణంరాజు నడుపుతున్నాడు.సమాచారం తెలుసుకున్న టౌన్ సిఐ రాము సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
మునగాల నుండి రామాపురం క్రాస్ రోడ్డు వరకు స్పీడ్ గన్స్,డేంజర్ లైట్స్ పెంచుతాం ఎస్పీ రాహుల్ హెగ్డే

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ లో మార్చిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వరుసగా యాక్సిడెంట్లు జరుగుతున్న క్రమంలో హైవే అథారిటీ వారితోటి ఆర్ అండ్ బి అధికారులతో ఈ మధ్యకాలంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని ఆ మీటింగ్ లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో తగు ఏర్పాట్లను చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.మునగాల నుండి రామాపురం క్రాస్ రోడ్ వరకు స్పీడ్ గన్స్,డేంజర్ లైట్లు వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయమని చెప్పామని అన్నారు.ఈ యాక్సిడెంట్ వవర్ స్పీడు వల్లనే జరిగిందని అన్నారు.
కోదాడ పట్టణానికి కూతవేటు దూరంలో వరుస యాక్సిడెంట్లు
నేషనల్ హైవే పై గత రెండు రోజుల క్రితమే ఆగి ఉన్న లారీ కిందకు కారు దూరడం వల్ల కారులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే నేషనల్ హైవే పెట్రోలింగ్ వారు కానీ పోలీస్ పెట్రోలింగ్ వారు కానీ అటువంటి వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వలన ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.ఇకనైనా హైవేపై వాహనాలు నిలిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే కొంతవరకు యాక్సిడెంట్లను నివారించవచ్చని పలువురు వాపోతున్నారు.



