కోదాడ,ఏప్రిల్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జాతీయ రహదారి పై కోదాడ బైపాస్ సమీపంలో దుర్గాపురం స్టేజీ వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా,4గురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల కుటుంబాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సంతాపం, సానుభూతి తెలియజేశారు.రోడ్డు ప్రమాదంలో గాయ పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కుటుంబం భార్యా భర్తలు చనిపోవడం జరిగిందని ఆ ఘటన మరువక ముందే ఈరోజు ఈ ఘటన జరిగి 6గురు మరణించడం చాలా భాదాకరమన్నారు.
కోదాడలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా: పద్మావతి రెడ్డి
జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా కోదాడలో ట్రామా సెంటర్ ఏర్పాటు అత్యవసరమని, దీని ఏర్పాటుకు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.ఈ విషయాన్ని గతంలో కోదాడలో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ట్రామా సెంటర్ మంజూరుకు కృషి చేస్తామన్నారు.



