:నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి నీ మాదిగలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
:రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మతతత్వ పార్టీ బిజెపికి మాదిగలు బుద్ధి చెప్పాలి:రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ
కోదాడ,ఏప్రిల్ 30:(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మతతత్వ పార్టీ బిజెపికి మాదిగలు బుద్ధి చెప్పి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలో పట్టణ అధ్యక్షుడు ఏర్పుల చిన్ని అధ్యర్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్ మాదిగలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చింతా బాబు మాదిగ మాట్లాడారు ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు తెలంగాణలోని మాదిగలు అందరూ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలపడం జరుగుతుంది అని అన్నారు.రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.దేశంలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరి రఘువీరారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ,జిల్లా ప్రచార కార్యదర్శి బొల్లెపోగు స్వామి మాదిగ,టౌన్ అధ్యక్షులు కోదాడ రూరల్ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్ మాదిగ,అనంతగిరి మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీను మాదిగ,పిడమర్తి బాబురావు,చింతా వినయ్,వేణు,గోపి,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



