కోదాడ,మే 01(mbmtelugunews)/ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో కోర్టు ఆవరణంలో కోదాడ సబ్ జడ్జి శ్యామ్ కుమార్ ఆదేశానుసారం
మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కోదాడ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే భవ్యలు మాట్లాడుతూ కార్మికులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారని దాని ద్వారా కార్మికులు చట్టాలపై అవగాహన కలిగి వారు వారి యొక్క హక్కులను సాధించుకోవాలని అదేవిధంగా ప్రతి అసంఘటిత కార్మికుడు విధిగా వారి అనుబంధ సంస్థల నుండి గుర్తింపు కార్డు పొందాలని సూచించారు.అదేవిధంగా ప్రతి కోర్టులో లీగల్ ఎయిడ్ న్యాయవాదులు వాలంటీర్లు ఉంటారని వారి ద్వారా కార్మికులకు కావలసినటువంటి అన్ని రకాల సలహాలు సూచనలు పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నర్సింహారావు,ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,సహాయ కార్యదర్శి హనుమంత రాజు,కోడూరు వెంకటేశ్వర్లు,మంద వెంకటేశ్వర్లు,దొడ్డ శ్రీధర్,హేమలత,ధనలక్ష్మి ,సామా నవీన్,నాగుల్ పాషా, న్యాయవాదులు ఉయ్యాల నరసయ్య,జానీ పాషా,సగం వెంకటాచలం,పట్టణ ఎస్సై రంజిత్ రెడ్డి,రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి ,న్యాయవాదులు,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



