Sunday, December 28, 2025
[t4b-ticker]

ఘనంగా 138వ మేడే వేడుకలు

కోదాడ,మే 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 138వ మే డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామములో బోస్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ జెండాను సిపిఐ నాయకులు బొల్లు ప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్నకార్మికుల చట్టాలను కాలరాస్తుందని ఆయన తెలిపారు.ప్రభుత్వ కార్మిక రంగాలను విస్మరించి ప్రైవేటు రంగాలకు ఎర్రతివాసి వేస్తు దేశ సంపదను వారికి దోచి పెడుతుందని తెలిపారు.కార్మికులంతా ఏకమై ఐక్య పోరాటాలు నిర్వహించవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.కార్మికులంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.తమర గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు,కార్మిక నాయకులు పోతురాజు సత్యనారాయణ,సిపిఐ నాయకులు కొండ కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ,మాతంగి గాంధీ,కమతం పుల్లయ్య,బత్తినేని శ్రీనివాసరావు,కమతం కుటుంబరావు,కాటమరాజు,తమ్మినేని రమేష్,మందరపు బిక్షమయ్య,సుందరయ్య,బోడ నాగులు,కమతం అప్పారావు,నిడిగొండ శ్రీనివాసరావు,బొమ్మ కంటి లక్ష్మీ నరసింహ,కొండా జాలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular