విద్యార్థులకు నిర్వహించిన వెసవి తరగతుల ముగింపు
కోదాడ,మే 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మున్సిపల్ పరిధిలోని నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో విద్యార్థిని విద్యార్థులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వేసవి తరగతులు బుధవారం ముగిశాయి.ఈ సందర్భంగా చర్చిలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను చర్చి పాస్టర్ యేసయ్య ఘనంగా సన్మానించారు.అలాగే వేసవి బైబుల్ తరగతుల్లో పాల్గొని విద్యార్థులకు బోధించిన అధ్యాపకులకు సర్టిఫికెట్లు బహుకరించి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య,విజయానంద్,జిపిఎస్ కోఆర్డినేటర్ ద్రాక్షావల్లి,తబిత,జీవని,రాంబాబు,తమలపాకులు సైదులు,స్టీఫెన్,స్రవంతి,సుధా,నాన్సీ తదితరులు పాల్గొన్నారు
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



