బిజెపి పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం
కోదాడ,మే 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని ఆశాపుర ట్రేడర్స్ షాపు దగ్గర బిజెపి పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఆర్టిఐ సెల్ కన్వీనర్ కొండ్లే రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో 400 పార్లమెంటు సీట్లు గెలుస్తుందని అందులో నల్లగొండ ఉంటుందని అన్నారు.నల్లగొండ బిజెపి పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయంలో పోలింగ్ బూత్ అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైనది అన్నారు.పోలింగ్ బూత్ అధ్యక్షులు ఈ 12 రోజులు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యుల కొరకు కాకుండా భాజాపా పార్టీ కుటుంబానికి సమయమును కేటాయించాలని అన్నారు.ప్రతి రోజు మీ పోలింగ్ బూత్ ఏరియాలో ఉన్న ప్రతి వ్యక్తిని కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రతి ఓటర్ కు తెలియపరచాలి అన్నారు.మోడీ తీసుకున్న సంచల నిర్ణయాలు పార్టీ విజయానికి ఎంతో తోడ్పడుతాయన్నారు.ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి అన్నారు.ఈ సమావేశంలో 208 నుండి 217 పోలింగ్ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాస్,కొండపల్లి నాగమణి,పంది వెంకటరమణ,కొదుముల కళావతి,హితీష్,నవీన్ కుమార్ చారి,చింతకాయల అజయ్ యాదవ్,కనుమలపూడి శ్రీహరి,గడ్డం శ్రీనివాస్,గోదేశి లక్ష్మణ్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



