దేశంలోనే అత్యధిక మెజారిటీ తో గెలిచేది నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గం
కేసీఆర్ మోడీ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఖాయం
దేశంలో ఇండియా కూటమిదే విజయం
తెలంగాణలో బిఆర్ఎస్ కతం
ఈ ఐదు సంవత్సరాలలో కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల రూపురేఖలు మార్చుత
కోదాడ,మే 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దేశంలోనే అత్యధిక మెజారిటీ తో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలబోతున్నారని నీటి పారుదల శాఖ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ నుండి శ్రీనివాస ధియేటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.దేశంలో,రాష్ట్రంలో మోడీ కేసీఆర్ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.దేశంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే ఏమి చేశారని ప్రతి పక్షాలు అంటున్నాయి 120 రోజులలో కోదాడ నియోజక వర్గానికి 240 కోట్ల తో అభివృద్ధి చేశామని తెలిపారు.ఈ ఐదు సంవత్సరాలలో కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాల రూపు రేఖలు మారుస్తామని అన్నారు.నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ని అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తే మరికొన్ని ఎంపీ నిధులతో నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు. తెలంగాణలో టిఆర్ఎస్ కతం అవుతాదని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎర్నేని బాబు, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి,డేగ కొండయ్య,వివిధ మండలాల అధ్యక్షులు,స్థానిక కౌన్సిలర్లు మాజీ సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



