ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
బీబీనగర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ, కార్నర్ సమావేశం ఏర్పాటు.
పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి..
బీబీనగర్,మే03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బూర నర్సయ్య శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డితో కలిసి బీబీనగర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, పోచంపల్లి చౌరస్తా వద్ద కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. గతంలో ఎంపీగా ఉన్న హయాంలో పార్లమెంటు అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని, దాని ఫలితంగానే నేడు బీబీనగర్ లో ఎయిమ్స్, పార్లమెంటు పరిధిలో కేంద్రీయ, గురుకులాల విద్యాలయాలు ఏర్పాటు అయ్యాయని గుర్తు చేశారు. తనను గెలిపించి మరోసారి అవకాశం ఇస్తే భువనగిరిని ఐటి హబ్ గా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మితే భువనగిరి అభివృద్ధి మరో పదేళ్లు వెనక్కు వెలుతుందని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్న హయాంలో తాను చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో సోషల్ మీడియాలో అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి బీజేపీని గెలిపించాలని కోరారు.

బీజేపీతోనే భువనగిరి అభివృద్ధికి బాటలు –
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి..
భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి బూర నర్సయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా నాయకులు పిట్టల అశోక్, తొర్పునూరి రాజశేఖర్ గౌడ్, బీజేవైయం రాష్ట్ర కోశాధికారి అంబటి తరుణ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఇంజమూరి ప్రభాకర్, ప్రధానకార్యదర్శి కడెం పాండు, మాజీ అధ్యక్షుడు సురకంటి జంగారెడ్డి, నాయకులు భువనగిరి స్వామి గౌడ్, దాసమోని వెంకటేష్, దొంతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గోపాల్, పొట్ట నవీన్, శ్రీధర్, హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



