అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం,(అస్క్) ఉచిత కోచింగ్ సెంటర్ కు మెటీరియల్ పంపిణి
కోదాడ,మే 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ఎమ్మెస్ కళాశాల వేదికగా ఆస్క్ నిర్వహిస్తున్న టీఎస్ఆర్జెసి,పాలీసెట్ ఉచిత కోచింగ్ సెంటర్ కు కుర్రి సీతారాములు జ్ఞాపకార్థం వారి తనయుడు కుర్రి నాగరాజు ఉచిత మెటీరియల్ ని పంపిణీ చేసినట్లు ఆస్క్ అధ్యక్షులు బలుగూరి స్నేహ దుర్గయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విద్యార్థులకు మెటీరియల్ ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించాలంటే సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడంతో పాటు సబ్జెక్టు ను ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా అంచనా వేసుకుంటూ తదునుగుణంగా కష్టపడి సబ్జెక్టు నాలెడ్జ్ ను పెంచుకోవాలని,ఈ కోచింగ్ సెంటర్ అందించే నాణ్యమైన సబ్జెక్టును భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు,ఫ్యాకల్టీ చెరుకుపల్లి కిరణ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



