ప్రలోభాలకు గురికావద్దు:మున్సిపల్ కమిషనర్ రమాదేవి
కోదాడ,మే 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఓటు వజ్రయుధం ప్రలోభాలకు గురి కావద్దని కోదాడ మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి అన్నారు.శనివారం కోదాడ పట్టణం లో చేసిన ఓటు హక్కు వినియోగం పై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళా జాత ప్రదర్శన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు నియోజక వర్గాల లో రెండు టీమ్ లు గా ఓటు హక్కు వినియోగం పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు.ప్రతి ఒక్కరు ఎన్నికల సమయం లో పలువురు ప్రలోభాలకు గురి చేస్తారని ఎవరుకూడ బహుమతులను తీసుకొని డబ్బుకు మద్యానికి మన ఓటు ను అమ్ముకోవద్దని సూచించారు నిజాయితీగా ఓటు వేయడం తో ప్రజా స్వామ్యం పరిరక్షణ చేయాల్సిన భాధ్యత మన అందరి పైన ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమం లోతెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పల్లెల లక్ష్మణ్,పాలకుర్తి శ్రీకాంత్,పల్లెల రాము,మేడిపల్లి వేణు,గజ్జి మంజుల,వంటేపాక ప్రియాంక,నెమ్మాది స్రవంతి,జూనియర్ అసిస్టెంట్ వీరయ్య,బాబురావు,బియల్ ఓ నాగమణి,మీరా,మమత,సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.



