ఇంటర్ స్టేట్ టాపర్ విద్యార్థినికి అభినందన సభ
కోదాడ,మే 05:(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోనే 18వ వార్డు గణేష్ నగర్ ఐదో వీధికి చెందిన యలమర్తి ప్రహర్షిణి స్థానిక శ్రీవిద్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచినందుకు ఐదో వీధి ప్రజలు ప్రహర్షిణి ని ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమానికి పెదనాటి నరసింహారావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కనగాల రాధాకృష్ణ హాజరై విద్యార్థినిని అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డురాదని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరినారు.పిల్లలకు వారి యొక్క చదివే వారికి గొప్ప గౌరవాన్ని తీసుకువస్తుంది ఆ గౌరవంతో పాటు తల్లిదండ్రుల యొక్క కలలను కూడా సహకారం చేసిన వారు అవుతారని అన్నారు.అనంతరం 5 వీధి ప్రజలు ప్రహర్షిణి ని వారి తండ్రిని శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాతంగి ప్రభాకర్ రావు,మస్తాన్,దాస్,శ్రీనివాస్ రెడ్డి,రామకోటేశ్వరరావు,గురునాధం,విన్సెంట్,పొట్లూరి ప్రసాద్,నరేష్,హరిబాబు,హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.



