ముఖ్యమంత్రి దృష్టికి లారీ యజమానుల సమస్యలు………
:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని. శ్రీనివాసరావు.
కోదాడ మే 07(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసామని కోదాడకు చెందిన తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు తెలిపారు.ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం రద్దు చేయడంతో పాటు భారీగా పెంచిన ఫిట్నెస్ చార్జీలు తగ్గింపు ఇంకా అనేక రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగంలో ఉన్న లక్షలాది కార్మికులు ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు తీర్మానం చేసినట్లు వారికి తెలిపారు.పార్లమెంటు ఎన్నికల అనంతరం లారీ యజమానులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు అమలు చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ ఆవుల రామారావు,సెక్రటరీ దుర్గాప్రసాద్,ట్రెజరర్ గణేష్ యాదవ్,వైస్ ప్రెసిడెంట్లు జగన్నాథ రెడ్డి,సలీం,సాదిక్ భాయ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.



