బిఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి యువజన నాయకుడు
కోదాడ,మే 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు మద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా పనిచేసిన సరైన గౌరవం దక్కలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ ప్రాంతంలో ఉన్న యువతకు సహాయం చేయాలని ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తో పాటు ప్రజలకు తోడుగా ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కార దిశగా ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు.

రాబోయే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామినేని శ్రీనివాసరావు,ఆలేటి రాంబాబు తదితరులు ఉన్నారు.



