:నడిగూడెం ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక
:నడిగూడెం మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా: ఎంపీపీ యాతాకుల జ్యోతి మధు బాబు
కోదాడ,మే 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోదాడ బిఆర్ఎస్ పార్టీకి భారీ శాఖ తగిలింది.నడిగూడెం మండల ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీపీ యాతాకుల జ్యోతి మధు బాబుకు ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తానని ఆమె అన్నారు.రాబోయే ఎంపీ ఎన్నికలలో రఘువీర్ రెడ్డి గెలుపుకై కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికలలో రఘువీర్ రెడ్డి గెలుపుకై శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.కోదాడ నియోజకవర్గంలోనే నడిగూడెం మండలం ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ తీసుకొస్తానని అన్నారు. దేశంలోనే కోదాడ నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి,వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



